రుచికరమైన వంకాయ బోండా
కావలసిన పదార్థాలు:
వంకాయలు - ఐదు,
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు,
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను,
శెనగపిండి - ఒక కప్పు,
తినే సోడా - చిటికెడు,
జీలకర్ర - ఒక టీ స్పూను,
వాము - అర టీ స్పూను,
పచ్చిమిరపకాయలు - నాలుగు,
కారం - ఒక టీ స్పూను,
ఉప్పు - తగినంత,
నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:
1. వంకాయల్ని శుభ్రంగా కడిగి గుత్తివంకాయల్లా కోసుకోవాలి.
2. స్టౌ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి వంకాయల్ని వేసి ఓ పదినిమిషాలు ఉడికించి దించేయాలి.
3. స్టౌ మీద మరో గిన్నె పెట్టుకుని సరిపడా నూనె వేసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, అల్లంవెలుల్లి ముద్ద వేసి బాగా వేగించుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, గరంమసాలా వేసి బాగా కలిపి దించేయాలి. దీన్ని వంకాయల మధ్యలో పెట్టుకోవాలి.
4. ఒక గిన్నెలో శెనగపిండి, కారం, ఉప్పు, సోడా, సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి.
5. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక మసాలా పెట్టిన వంకాయల్ని శెనగపిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. వీటిని టమోటా సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

0 comments:
Post a Comment