తింటే సొరకాయ దోసె తినాలి..
కావలసిన పదార్థాలు:
సొరకాయ: 1
బియ్యంపిండి: 1/2kg(బియ్యం నానబెట్టి బాగా నానాక కాస్త ఆరబెట్టి, కొట్టిన పిండి)
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: 1/2tsp
పచ్చికారం: 1tsp
పచ్చిమిర్చి: 3-4(సన్నగా తరిగినవి)
అల్లం: చిన్నముక్క(సన్నగా తరిగినది)
నూనె: తగినంత
కరివేపాకు: రెండు రెమ్మలు
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం పిండి రెడీ చేసుకోవాలి. లేదా మామూలుగా దోసె పిండిని రెడీ చేసుకోవాలి.
2. సొరకాయ శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండానే తురుముకోవాలి. అలాగే ఎండు కొబ్బరి తురుమిపెట్టుకోవాలి. (ఈ తురుముని దోసె పిండిలోనైనా కలుపుకోవచ్చు లేదా బియ్యంతో పాటు కొబ్బరి తురుము, సొరకాయ తురుము వేసి రుబ్బుకోవచ్చు)
3. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకొన్న పిండికి కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. బియ్యం పిండిలో పసుపు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, తగినంత ఉప్పు కూడా కలిపి నీళ్లుపోసి దోసెపిండిలా జారుగా కలుపుకోవాలి.
4. తర్వాత పది నిముషాలు నానితే చాలు. స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె రాసి దోసెలు పోయాలి. కరకరలాడే సొరకాయ దోసెలు రెడీ. ఇవి వేడివేడిగానే బాగుంటాయి. వీటిని అల్లం పచ్చడితో తింటే రుచిగా ఉంటాయి.

0 comments:
Post a Comment