Sunday, February 10, 2013

బొబ్బట్లు

బొబ్బట్లు


కావలసిన పదార్థాలు:
మైదా : ఒక కప్పు
ఉప్పు : 1/2 టేబుల్‌ స్పూన్‌
చక్కెర : ఒక టేబుల్‌ స్పూన్‌
నూనె : 4-5 టేబుల్‌ స్పూన్లు
నీరు : సరిపడినంత
(వీటన్నింటి కలిపి చపాతీ పిండి కలుపుకోవాలి)

శనగ పప్పు : ఒక కప్పు
బెల్లం తురుము : ఒక కప్పు
తురిమిన కొబ్బరి : పావు కప్పు
యాలకులు : రెండు

తయారు చేసే విధానం:
శనగపప్పును ఉడికించి, నీళ్లు వంచి చల్లార్చి, బెల్లం తురుము, యాలకులు కలుపుకొని పొడిగా రుబ్బుకోవాలి, తరువాత కొబ్బరి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

మైదా, ఉప్పు, చక్కెర, నూనె కలిపి పెట్టుకున్న ముద్దల్లోంచి కొంత మిశ్రమాన్ని తీసుకుని నూనె సహాయంతో చదునుగా ఒత్తుకోవాలి. ఇందులో శనగపిండి మిశ్రమాన్ని పెట్టి ఉండచేయాలి. తరువాత మరలా చపాతీలా ఒత్తుకోవాలి. దీన్ని పైనం పైన గోధుమ రంగు వచ్చే దాకా కాల్చాలి. కాల్చేటప్పుడు నెయ్యి వేసుకోవాలి. అంతే వేడి వేడిగా బొబ్బట్లను నెయ్యితో వడ్డించండి.

0 comments:

Post a Comment