Tuesday, February 5, 2013

బెంగుళూరు వంకాయతో....... పెరుగు చట్నీ

బెంగుళూరు వంకాయతో.......

పెరుగు చట్నీ


కావలసిన పదార్థాలు:బెంగుళూరు వంకాయలు - 2, పసుపు - చిటికెడు, పెరుగు - 2 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, ఆవపిండి - పావు టీ స్పూను, నూనె - 1 టేబుల్ స్పూను, ఆవాలు+జీలకర్ర+మినప్పప్పు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి+ అల్లం పేస్టు - అర టీ స్పూను, ఎండుమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - చిటికెడు.

తయారుచేసే విధానం:ఒక పాత్రలో పెరుగు, తగినంత ఉప్పు, ఆవపిండి వేసి గిలకొట్టి పెట్టుకోవాలి. కడాయిలో సన్నగా కోరిన / తరిగిన బెంగుళూరు వంకాయల్లో, కప్పు నీరు, పసుపు వేసి మెత్తగా ఉడికించి మెదపాలి. ఈ గుజ్జుని పెరుగులో వేసి కలపాలి. మరో పాత్రలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు,మినప్పప్పు, కరివేపాకు, ఇంగువతో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ చట్నీ అన్నంతో పాటు,చపాతీల్లో కూడా బాగుంటుంది.

0 comments:

Post a Comment