Tuesday, February 5, 2013

కాలీఫ్లవర్ పకోడీలు

కాలీఫ్లవర్ పకోడీలు


కావలసిన పదార్థాలు:
కాలీ ఫ్లవర్: చిన్న పువ్వు
శనగపిండి: 3cups
బియ్యం: 2tbsp
నూనె : వేయించడానికి సరిపడా
పసుపు: చిటికెడు
ఉప్ప: రుచికి తగినంత
కారం: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp

తయారు చేసే పద్ధతి:
1. కాలీఫ్లవర్‌ ను పువ్వులుగా విడగొట్టాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. అవి కొంచెం మెత్తగా అయ్యాక దించాలి.
2. తర్వాత శనగపిండిలో అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా పొడి వేసి జారుగా కలిపి, అందులో ఉడికించిన కాలీ ఫ్లవర్‌ ను వేసి నూనెలో వేయించాలి. ఇవి ఎర్రగా వేగాక తీసి టమోటా సాస్‌ తో సర్వ్ చేస్తే బాగుంటాయి.

0 comments:

Post a Comment