Friday, February 15, 2013

పాలకూర పకోడీ

పాలకూర పకోడీ

కావలసిన పదార్థాలు:
పాలకూర: 5కట్టలు
సెనగపిండి: 1cup
కారం పొడి:1tbsp
ఉల్లిపాయలు:4
వంట సోడా: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా
పసుపు:చిటికెడు

తయారు చేయు విధానం:

1. ముందు గా పాలకూర కాడలను వలిచి ఆ తరువాత కట్టలను విడదీసి నీళ్ళలో బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు సెనగపిండిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నె లో జల్లించి దానికి తగినంత ఉప్పు, కారం, పసుపు, తరిగిన ఉల్లిపాయ, వంటసోడా కలిపి, నీళ్ళతో జారుడుగా బజ్జీల పిండిలా కలపండి. ఆ తరువాత తరిగి వుంచిన పాలకూరను కూడా అందులో వేసి కలిపుకోవాలి.
3. పాన్ లో నూనె వేసి కాగాక అందులో జారుడుగా కలుపుకొన్న పాలకూర మిశ్రమాన్ని వేసి ఎర్రగా వేయించి తీయాలి. అంతే పాలకూర పకోడి రెడీ.

0 comments:

Post a Comment