సర్వపిండి
అప్పాలు కావలసినవి
బియ్యప్పిండి - పావు కేజీ
ఉల్లికాడలు - నాలుగు
(కాడలు లేనప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒకటి)
సొరకాయ తురుము - అర కప్పు
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి పేస్టు - టీ స్పూన్
శనగపప్పు - 50 గ్రా (రెండు గంటల సేపు నానబెట్టాలి)
నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
కొత్తిమీర - అర కట్ట (తరగాలి)
కరివేపాకు - రెండు రెమ్మలు (తరగాలి)
నువ్వులు - రెండు టీ స్పూన్లు
సర్వపిండి అప్పాలు తయారి
బియ్యప్పిండిలో పైన తీసుకున్న వాటిలో నూనె మినహా మిగిలిన
అన్ని పదార్థాలనూ వేయాలి. తర్వాత తగినన్ని వేడి నీటితో చపాతీల పిండిలా కలుపుకోవాలి.
మందంగా ఉండే అల్యూమినియం పాత్ర లోపలి అంచులకు నూనె రాయాలి. ఆ తర్వాత పిండి
మిశ్రమాన్ని పాత్ర అంచులకు అంటేటట్లు అద్ది, పైన స్పూను నూనె వేసి సన్న మంట మీద
కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత అప్పం గిన్నెను వదిలి ఊడి వస్తుంది. దాన్ని తీసి
మరొక వైపుకు అమర్చి కాల్చాలి. ఈ అప్పం కాలేటప్పుడు గిన్నెకు మూత పెట్టకూడదు. అల్యూమినియం
పాత్రకు బదులు స్టీలు పాత్ర వాడితే అప్పం కాలకముందే మాడిపోతుంది. నాన్‌స్టిక్‌లో అప్పం
వచ్చినప్పటికీ రుచిగా అనిపించదు. అల్యూమినియం పాత్ర లేకపోతే బాణలిలో చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment