Friday, February 15, 2013

అరటి వడలు

అరటి వడలు 
కావలసినవి:
అరటికాయలు - రెండు
పచ్చిమిర్చి - ఆరు(తరగాలి), కొత్తిమీర - కట్ట
పుదీన - కట్ట, కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడినంత
బియ్యప్పిండి - రెండు టేబుల్ స్పూన్‌లు
అల్లంవెల్లుల్లి పేస్టు - టీ స్పూన్
తయారి: అరటికాయలను తొక్కతీయకుండా ఉడికించాలి. కుకర్‌లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే చాలు. చల్లారిన తర్వాత తొక్కతీసి గుజ్జును చిదమాలి. అందులో ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీన, కరివేపాకు, పచ్చిమిర్చితరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. ఈ మిశ్రమంలో వడ చేయడానికి అనువుగా తగినంత బియ్యప్పిండి కలుపుకోవాలి. మిశ్రమాన్ని గోళీలుగా చేసి వడల్లా వత్తి మరుగుతున్న నూనెలో వేసి దోరగా వేయించి తీయాలి.

0 comments:

Post a Comment