Sunday, February 10, 2013

సగ్గుబియ్యం పెసరపప్పు ఉప్మా


సగ్గుబియ్యం పెసరపప్పు ఉప్మా


.కావాల్సిన పదార్థాలు:
సగ్గుబియ్యం- 1 కప్పు, పెసర పప్పు- 1 కప్పు, ఉల్లిగడ్డ- పెద్దదొకటి, పచ్చిమిరప కాయలు- 6, కొత్తిమీర, కరివేపాకు- తగినంత

తయారీ విధానం:
ఉప్మా తయారీ కోసం నాలుగు గంటల ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి తడిబట్టలో మూట కట్టాలి. అలాగే ఒక గంట ముందుగా పెసరపప్పును నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు బాణిలో నూనె పోసి వేడెక్కాక అందులో పోపు దినుసులను వేసుకోవాలి. తర్వాత మిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు వేయాలి.

ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి పది నిమిషాలపాటు ఉడికించాలి. తర్వాత సగ్గుబియ్యం, ఉప్పు వేసి సన్నటి సెగపై మరో పది నిమిషాలపాటు ఉడికించాలి. అంతే సగ్గుబియ్యం-పెసరపప్పు ఉప్మా సిద్ధమైన ట్లే. ఇది తింటానికి రుచికరంగా ఉంటుంది.

0 comments:

Post a Comment