Friday, February 15, 2013

బటన్ వడ

బటన్ వడ
కావలసిన వస్తువులు :

మినప్పప్పు – 200 gms

పచ్చిమిరపకాయలు – 4

జీలకర్ర – 1 tsp

ఉప్పు -తగినంత

నూనె – వేయించడానికి

సాంబార్ ఇంతకుముందు చెప్పినట్టుగా చేసిపెట్టుకోండి.

మినప్పప్పును శుభ్రం చేసుకుని లీటర్ నీళ్లు పోసి కనీసం నాలుగు గంటలైనా నాననివ్వాలి. తర్వాత పప్పును జల్లెడలో వేసి నీరంతా ఓడ్చాలి. నానిన పప్పును తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా కాటుకలా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు ఎక్కువ నీళ్లు పోయకూడదు. ఒకవేళ అవసరమనుకుంటే కొద్దిగా నీరు పోయాలి. ఈ పిండిలో తగినంత ఉప్పు, జీలకర్ర వేసి కలియబెట్టాలి. బాణలిలో నూనె వేడి చేయాలి. మినప్పప్పును చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వడలుగా వత్తుకుని మధ్యలో రంద్రం చేయాలి. ఈ వడలు రూపాయి బిళ్ల అంత ఉంటే చాలు. వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అన్నీ వడలు అలా చేసి ఉంచుకోవాలి. ఒక గిన్నె లేదా బౌల్ లో వేడి సాంబార్ పోసి అందులో ఐదారు వడలు వేసి కొద్దిగా నాననిచ్చి వడ్డించాలి. సరదాగా తినడానికి బావుంది కదా ఈ ఐడియా..

0 comments:

Post a Comment