Saturday, February 16, 2013

కొంకనీ సాంబార్

కొంకనీ సాంబార్

ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంస్కృతి ఉంటుంది. అంతే కాదు రుచులు కూడా విభిన్నంగా ఉంటాయి. సౌత్ ఇండియన్ వంటలు, నార్త్ ఇండియన్ వంటలన్నీ చాలా ఫేమస్ గా వర్ణించుకుంటుంటారు. ముఖ్యంగా టూరిస్ట్ ప్రదేశాల్లో రుచులు కూడా విభిన్నంగా ఉంటాయి. మహారాష్ట్ర, కర్ణాటక, మరియు గోవా ఇలా ఒక్కో ప్రదేశానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. కొంకన్ సాంబార్ రిసిపి కొన్ని రాష్ట్రాల మిశ్రమ వంటకం. ముఖ్యంగా నార్త్. గోవా, మహారాష్ట్ర, మరియు కర్ణాటకాలల్లో ఎక్కువగా వండుతారు.

ఈ సాంబార్ ఇతర సాంబార్ల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంకన్ రిసిపిలన్నింటిలోనూ పచ్చికొబ్బరి తురుమును వాడుతుంటారు. అదే విధంగా తయారు చేయబడినది ఈ కొంకన్ సాంబార్. చాలా టేస్ట్ గా ఉండే ఈ కొంకన్ సాంబార్ ప్లైయిన్ రైస్ కి అద్భుతంగా ఉంటుంది.

కావల్సిన పదార్థాలు:
కందిపప్పు: 1 cup
పసుపు: 1/2 tsp
ఆవాలు: 1tsp
ధనియాలు: 1/2 tsp
జీలకర్ర: 1/2 tsp
మెంతులు: 1/2 tsp
ఎండు మిర్చి: 4
ఇంగువ: 1 pinch
కరివేపాకు ఆకులు: 8
శుపగ: 1tbsp
కొబ్బరి తురుము: 1/2 cup
బీన్స్: 8 (chopped)
క్యారెట్: 1 (chopped into small pieces)
క్యాలిఫ్లవర్: 8 florets
టమోటొ: 1 (cut into 4 quarters)
మునగకాడలు: 2 (cut into 1 inch pieces)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా కుక్కలర్ లో కందిపప్పు వేసి, నీళ్ళతో శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో మూడు కప్పుల నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు, డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర తరుగు, మెంతులు, ఆవాలు వేసి వేయించుకోవాలి.
3. ఒక నిముషం తర్వాత అందులో శెనగపప్పు మరియు కొబ్బరి తురుము వేసి తక్కువ మంట మీద మరో 4-5నిముషాల పాటు వేగించాలి.
4. ఇప్పుడు ఈ వేయించిన మిశ్రమాన్నంతా పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత తీసి, స్టౌ మీద పెట్టి, అందులో కట్ చేసి పెట్టుకొన్న టమోటో, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, మునగకాడలు మరియు పేస్ట్ చేసి పెట్టుకొన్న మసాలా వేసి, టేస్ట్ కు సరిపడా ఉప్పు వేసి, ఎక్కువ మంట పెట్టి ఐదు నిముషాలు ఉడికించాలి.
6. ఇప్పుడు అందులో కరివేపాకు ఆకులు వేసి, మూత పెట్టి మరో విజిల్ వచ్చే వరకూ ఉడికించాలి. అంతే కొంకనీ సాంబార్ రెడీ... దీన్ని వేడి వేడి ప్లేయిన్ రైస్ కు చాలా బాగా ఉంటుంది.

0 comments:

Post a Comment