Saturday, February 2, 2013

క్యాప్సికం ష్టఫ్ చేసిన కూర


క్యాప్సికం ష్టఫ్ చేసిన కూర

కావాల్సిన పదార్ధాలు

క్యాప్సికం -- అర కేజీ
సెనగ పిండి -- అర కేజీ
ఉప్పు -- రెండు టీ స్పూన్స్
కారం -- ఒక టీ స్పూన్
నూనె -- రెండు గరిటెలు
వాము -- ఒక టీ స్పూన్

తయారు చేసే విధానం ;-

ముందుగ ఒక గిన్నె తీసుకుని అందులో సెనగ పిండి,ఉప్పు,కారం ,వాము, రెండు టీ స్పూన్స్ నూనె వేసి పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి.పిండి నోట్లో వేసుకుంటే ఉప్పగా వుండాలి.అప్పుడే కురలోకి ఉప్పు సరిపోతుంది.ఇప్పుడు క్యాప్సికం ను తీసుకుని బాగా కడిగి గుత్తి వంకాయ కూరకు తరిగి నట్టుగా క్యాప్సికంను నాలుగు పక్షాలుగా తరిగి అందులో ఇందాక మనము కలిపి ఉంచుకున్న పిండిని కూరి ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి రెండు గరిటెల నూనే పోసి కూరి పెట్టుకున్న క్యాప్సికం లను గిన్నెలో వేసి మంటను సిమ్ లో పెట్టి వేయించాలి.మాడకుండా ఉండటానికి మధ్య మధ్య లో గిన్నెను పట్టకారుతో కుదపాలి.అప్పుడు కాయలు మాడకుండా బాగా వేగుతాయి. అంతే ఘుమఘుమ లాడే క్యాప్సికం ష్టఫ్ చేసిన కూర రెడీ.

0 comments:

Post a Comment