Friday, February 15, 2013

పిండి మిరియం

పిండి మిరియం






కావలసిన పదార్థాలు

కంది పప్పు ఉడికించినది: 1కప్పు
చింతపండు పులుసు: 1 ½ కప్పు
కావలసిన కూరముక్కలు:
అరటికాయ/పొట్లకాయ/కాకరకాయ/గోరుచిక్కుడు ఏదైన ఒకటి: 1 కప్పు ఉడికించినవి
పిండిమిరియం ముద్ద
ఉప్పు: తగినంత
పసుపు: చిటికెడు
పోపుకి: ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు,కరివేపాకు, కొత్తిమీర.

పిండిమిరియం ముద్ద తయారికి:

మినప పప్పు: 2 టీస్పూ//
శనగ పప్పు: 1 టీస్పూ//
మిరియాలు: ఒక టీస్పూ//
ధనియాలు: 3 టీస్పూ//
ఎండుమిరపకాయలు: 3
ఎండు కొబ్బరి తురుము: 1 చిన్న కప్పు
ఇంగువ: చిటికెడు

తయారీ విధానం

ముందు పిండి మిరియం ముద్దను తయారు చేసుకోవాలి – దీనికోసం, చెప్పబడ్డ పదర్ధాలన్ని కొంచెం నూనె వేసి దోరగ వెయించుకోని, మెత్తగ paste ల రుబ్బుకోవాలి. (ఎంత మెత్తగ వుంటే అంత బాగుంటుంది)

తర్వాత, ఒక బాణెలిలో కొంచెం నూనె వేసి పోపు వేసుకుని, అది వేగాక చింతపండు పులుసు పోసుకుని కొంచం ఉడకనివ్వాలి.

అందులోముందుగా ఉడికించుకున్న కూరముక్కలు వేసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కళపెళ ఉడకనివ్వాలి.

అదిబాగా ఉడుకుతున్నప్పుడు ముందు తయారు చేసుకున్న పిండిమిరియం ముద్ద జాగ్రత్తగ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.

ఆ మిశ్రమాన్ని బాగా తెర్లనివ్వలి.

చివరిగా, దానికి ఉడికించిన కందిపప్పు కలిపి 10 నిమిషాలు ఉడకనివ్వాలి

0 comments:

Post a Comment