Sunday, February 3, 2013

సగ్గుబియ్యం ఉప్మా

.సగ్గుబియ్యం ఉప్మా

కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం ఒక కప్పుఉల్లి తరుగు అరకప్పుపచ్చిమిర్చి తరుగు ఒక టీ స్పూన్‌, అల్లం తరుగు అర టీ స్పూన్‌, ఎండు కొబ్బరి తురుము ఒక చెంచా, వేరుసెనగ పప్పు మూడు చెంచాలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం రెండుచెంచాలుజీలకర్ర చిటికెడు, ఆవాలు చిటికెడుకరివేపాకు రెండు రెబ్బలు
తయారీ విధానం: సగ్గుబియ్యం అరగంటపాటు నానపెట్టి, వండేందుకు నీటిని తీసివేసి, పలుచని బట్టపైన ఆరపెట్టాలి. వేరుశనగ పప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర, ఆవాలు వేసి, వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. వీటికి సగ్గుబియ్యం చేర్చి ఐదునిమిషాలు ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడే వేయించిన వేరుశెనగ పప్పులు. కొబ్బరితురుము వేసి, మరి కాసేపు ఉడికించాలి. స్టౌపై నుంచి దించి నిమ్మరసం పిండాలి.

0 comments:

Post a Comment