ఉల్లిపాయ పులుసు
చిన్న ఉల్లిపాయలు – 10
నూనె – 3 tsp
టమాటాలు – 2
పసుపు – 1/4 tsp
కారంపొడి – 1 tsp
గరం మసాలా పొడి – 1/4 t sp
చింతపండు పులుసు – 3 tbsp
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 ts p
కరివేపాకు – 2 రెమ్మలు
ఈ కూర కోసం చిన్న ఉల్లిపాయలు లేదా ఉల్లిపొరక చివరలో ఉండే ఉల్లిపాయలు కూడా తీసుకోవచ్చు. వాటికి పై పొర తీసేసి చాకుతో గాట్లు పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేసి నిదానంగా మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కారంపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరి కొద్ది సేపు వేపాలి. ఇప్పుడు కరివేపాకు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి. ఉల్లిపాయలు మసాలాలో బాగా కలిసిపోయాక చింతపండు పులుసు, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. చివరిలో గరం మసాలా పొడి కలిపి కొత్తిమిర చల్లి దింపేయాలి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. నిమిషాల్లో తయారవుతుంది ఈ కూర. అన్నం, చపాతీలకు చాలా బావుంటుంది.

0 comments:
Post a Comment