Friday, February 15, 2013

మసాలా పూరీలు

మసాలా పూరీలు

- ఇవి కావాలి
తెల్ల నువ్వులు : అరకప్పు
అల్లం : 50 గ్రా
పచ్చిమిర్చి : పన్నెండు
డాల్డా : కప్పు
నూనె : వేయించడానికి సరిపడా
జీలకర్ర : ఐదు చెంచాలు
ఉప్పు : రెండు చెంచాలు
సోయా పిండి : పావు కప్పు
మొక్కజోన్న పిండి : పావు కప్పు
ఎండు కొబ్బరి తురుము: ఐదు చెంచాల చొప్పున
మైదా : 250 గ్రా
ఆకుపచ్చ రంగు : అరచెంచా

- ఇలా చేయాలి
డాల్డాను కరిగంచి పెట్టుకోవాలి, వెడల్పాటి పాత్రలో మైదా, మొక్కజొన్న పిండి, సోయా, ఎండు కొబ్బరి తురు ము తీసుకుని డాల్డా వూసి బాగా కలపాతి ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి ముద్ద, రంగు చేర్చి..నీటితో గట్టిగా చపాతీ పిండిలా చేసుకునిన బాగా కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి.. ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని నువ్వులు ముంచి పూరిల్లా వత్తుకోవాలి.ఫోర్కుతో మధ్య మధ్య గాట్లు పెట్టి నూనెలో వేయిస్తే చాలు. మసాలా పూరీలు రెడీ. ఇవి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి.

0 comments:

Post a Comment