కార్న్ చెక్కలు
కావలసినవి:
కార్న్ (మొక్కజొన్న గింజలు) - కప్పు
మైదాపిండి - కప్పు
పచ్చిమిర్చి - 3
జీలకర్ర - పావు టీ స్పూను
ఉప్పు, నూనె - సరిపడా
తయారి: మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో మైదాపిండి, ఉప్పు, గరిటెడు నూనె, జీలకర్ర వేసి (ఇందులో నీళ్లు పోయవలసిన అవసరం లేదు) చపాతీపిండిలా కలుపుకోవాలి. ఈ ముద్దను చిన్న ఉండలుగా చేసుకొని పలుచగా పూరీలుగా ఒత్తి, నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరవాత వీటిని ఆ నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వారం రోజుల వరకు నిలవ ఉంటాయి.
0 comments:
Post a Comment