Tuesday, February 5, 2013

సొరకాయ హల్వా

సొరకాయ హల్వా

కావలసిన పదార్ధాలు:
లేత సొరకాయ తురుము: 3cups
పంచదార: 2cup
కోవా: 100grms
నెయ్యి: 2tbsp
ఫుడ్ కలర్: 1/4tsp(green)
ఏలకుల పొడి: 1tsp
పిస్తా: 6
జీడిపప్పు: 6

తయారు చేయు విధానము:
1. మొదటగా సొరకాయకు పై పొట్టు తొలగించి, గింజలను కూడా తేసేని తర్వాత తురిమి పెట్టుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక సొరకాయ తురుముని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
2. తర్వాత వేగిన తురుములోనే కోవా, ఫుడ్ కలర్, యాలకల పొడి వేసి వేయించాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమంలోని పంచదార వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమంతా కలిసి దగ్గర పడేవరకూ కలియబెడుతూనే ఉండాలి. ఇది పూర్తిగా హల్వా ముద్దలా అయ్యాక దింపేసి అందులో నెయ్యిలో వేయించిన ప్రక్కన పెట్టుకొన్నద్రాక్ష, జీడిపప్పు, గార్నిష్ గా అలంకరించి అథిదులకు సర్వ్ చేయాలి.

0 comments:

Post a Comment