Sunday, March 3, 2013

టమాట పచ్చడి

టమాట పచ్చడి

కావాల్సిన పదార్ధాలు ;-

టమాటాలు - కేజీ
చింతపండు - నిమ్మకాయంత సైజు లో తీసుకోవాలి
మినపపప్పు - ఒక టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీ స్పూన్
మెంతులు - ఒక టీ స్పూన్
ఇంగువ - ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయలు - 20
పచ్చిమిరపకాయలు - 10
పసుపు - పావు టీ స్పూన్
ఉప్పు - 3 టీ స్పూన్స్
తయారు చేసే విధానం ;-

ముందుగ
ఒక చిన్న బాండి తీసుకుని అందులో రెండు టీ స్పూన్స్ నూనే వేసి
మినపపప్పు,ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు ,ఇంగువ,పసుపు వేసి పోపు వేయించి
పక్కన పెట్టుకోవాలి.తరవాత ఒక గిన్నెలో 3 గరిటెల నూనే పోసి టమాటాలు
,ఉప్పు,చింతపండు వేసి మగ్గ నివ్వాలి.మెత్తగా వుడికిన తరవాత స్టవ్ మిద
నుంచి దించేసి చల్లారిన తరువాత టమాటాలు,పోపు,పచ్చిమిరపకాయలు,కొద్దిగా
కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.పక్కన ముందే కొద్దిగా పోపును తీసి
పెట్టి రుబ్బిన పచ్చడిలో కలపాలి.అంతే ఘుమ ఘుమ లాడే టమాట పచ్చడి రెడీ.

0 comments:

Post a Comment