Sunday, March 3, 2013

'' బందరు లడ్డు ''

'' బందరు లడ్డు ''
కావలసినవి:
శనగపిండి - అరకిలో, పంచదార - 400 గ్రా, నెయ్యి - పావు కేజీ, జీడిపప్పు - 100 గ్రా, ఏలకుల పొడి - టీస్పూన్, నూనె - డీప్ ఫ్రైకి సరిపడ, కిస్మిస్ - తగినన్ని, పాలు - తగినన్ని
తయారి:
శనగపిండిలో నీళ్లు పోసుకుని ముద్దలా కలు...పుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్‌ని వేయించి జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక కలిపి పెట్టుకున్న శనగపిండి ముద్దని గిద్దల్లో పెట్టి చక్రాల్లా వత్తుకుని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి పక్కన ఉంచాలి. పక్కన ఒక గిన్నెలో పాకానికి సరిపడ నీళ్లు పోసి పంచదార వేసి తీగపాకం పట్టుకుని అందులో వేయించిన చక్రాలను వేసి పక్కన పెట్టుకోవాలి. పాకం చల్లారిన తర్వాత చక్రాలను చేతితో మెదిపి మెత్తగా గ్రైండ్ చేసి అందులో జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమంలో పాలు చిలకరించి బాల్స్‌లా చుట్టుకుని నిలవచేసుకోవాలి.
బందరు లడ్డు రె
డీ

0 comments:

Post a Comment