Sunday, March 3, 2013

పెసర ఆవకాయ

పెసర ఆవకాయ

కావాల్సిన పదార్ధాలు ;-

6 ; మామిడి కాయలు
2కప్పులు ; పెసర పిండి
1tea స్పూన్ ; పసుపు
నునే ;1kg
ఉప్పు ; ముప్పావు కప్పు
కారం ; one అండ్ హాఫ్ కప్పు
ఇంగువ ;2 టీ స్పూన్స్

తాయారు చేసే విధానం ;-

ముందుగ మామిడి కాయలను శుబ్రంగ కడిగి తడి లేకుండా తుడవాలి.తరవాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టు కోవాలి.తరవాత ఒక బేసిన్లో పెసర పిండి ,ఉప్పు,కారం,పసుపు ,ఇంగువ వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని .తరవాత మామిడి ముక్కలను కూడా వేసి నునే పోసి ఎక్కడ పొడిగా లేకుండా అంతా బాగా కలిసే విధంగా కలిపి మూత పెట్టెయ్యాలి. మరుసటి రోజు ఒక గిన్నెలో హాఫ్ kg నునే పోసి అది బాగా కాగాక అందులో 2టీ స్పూన్స్ మెంతులు,1tea స్పూన్ ఆవాలు, 2టీ స్పూన్స్ ఇంగువ ,10 ఎండు
మిరపకాయలను ముక్కలుగా చేసి ఆ వేడి నూనెలో వేసి చిటపట లాడగానే ఈ నునేను పెసరవకయలో పోసి బాగా కలపాలి.చల్లారాక జాడిలోనికి తీసి పెట్టుకోవాలి.అంతే ఘుమఘుమ లాడే పెసర ఆవకాయ రెడీ.

0 comments:

Post a Comment