Saturday, March 2, 2013

బీన్స్ కూర

బీన్స్ కూర

కావాల్సిన పదార్ధాలు;-

బీన్స్ - అరకేజీ
మినపపప్పు - ఒక టేబుల్ స్పూన్
ఇంగువ - పావు టీ స్పూన్
ఆవాలు - అర టీ స్పూన్
జీలకర్ర - ఒక టీ స్పూన్
ఉప్పు - ఒక టీ స్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
ఎండుమిరపకాయలు - 6
నూనే - ఒక టేబుల్ స్పూన్
పసుపు - చిటికెడు
కొబ్బరి పొడి - ఒక టేబుల్ స్పూన్


తయారు చేసే విధానం ;-

ముందుగ
బీన్స్ ని బాగా కడిగి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్
మీద బాండి ని పెట్టి అందులో నూనే వేసి మినపపప్పు
,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చిముక్కలు,ఇంగువ వేసి పోపును దోరగా
వేగనివ్వాలి.వేగిన పోపులో కొబ్బరిపొడి ని ఉప్పు,కరివేపాకు వేసి ఒక రెండు
నిముషాలుంచి బీన్స్ ముక్కలు వేసి బాగా కలిపి,పసుపు కూడా వేసి ముక్కలు
ములిగే వరకు నీళ్ళు పోసి మూత పెట్టి బాగా వుడకనివ్వాలి.అంతే రుచికరమైన
బీన్స్ కూర రెడీ.ఈ కూర చపాతి లలోను అన్నం లోను కూడా బావుంటుంది.

0 comments:

Post a Comment