Friday, March 15, 2013

‎* బంగాళదుంప పచ్చిబఠానీ కర్రీ


* బంగాళదుంప పచ్చిబఠానీ కర్రీ

చాలా మంది తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. అంతే కాదు వారు తినే ఆహారం టేస్టీగా ఉండాలని కోరుకుంటారు. బంగాళదుంప కర్రీ ఆరోగ్యానికి మంచిది. 

కావల్సిన పదార్థాలు: బేబీ పొటాటో(చిన్న బంగాళదుంపలు): 20 పచ్చిబఠానీలు: 250grams పచ్చిమిర్చి: 2 (మద్యలోకి కట్ చేసుకోవాలి) జీలకర్ర: 1/2 tsp అల్లం: కొద్దిగా (minced) టమోటో: 1 (chopped) కారం: 1tsp జీలకర్ర: 1tsp ఎండిన మెంతి ఆకులు: 1tbsp ఫ్రెష్ క్రీమ్: 2tbsp గరం మసాలా: 1/2 tsp కొత్తిమీర: 2 sprigs(chopped) ఉప్పు: as per taste నూనె: 2tbsp 

తయారు చేయు విధానం: 1. ముందుగా బేబీ పొటాటో(చిన్న సైజులో ఉన్న బంగాళదుంపలను)శుభ్రం చేసి కుక్కర్ లో వేసి ఒక విజిల్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. 

2.
తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి పోయే వరకూ అలాగే ఉంచి, కొద్ది సేపటి తర్వాత కుక్కర్ మూత తీసి బంగాళదుంపల్ని చల్లటి నీటిలో వేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. 

3.
ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి, వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యాని ఆకు, మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. 

4.
తర్వాత అందులోనే ఉడికించి పొట్టుతీసి పెట్టుకొన్న బంగాళదుంపలను కూడా వేసి 5నిముషాల పాటు తక్కువ మంటలో వేయించుకోవాలి. 

5.
ఇప్పుడు అందులో అల్లం చిన్న ముక్కలుగా లేదా దంచుకొని వేసి, మరో నిముషం పాటు వేయించాలి. 

6.
తర్వాత టమోటో ముక్కలు మరియు ఉప్పు కూడా వేసి వేయించి రెండు నిముషాల తర్వాత పచ్చిబఠానీలు, కారం, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించాలి. 

7.
మిగిలిన మసాలా దినుసులన్నీ కూడా వేసి బాగా మిక్సి చేస్తూ మరో 5నిముషాల ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అందులో తగినన్ని నీళ్ళు పోసి, మూత పెట్టి మరో 5 నిముషాల ఉడికించాలి. 

8.
బేబీ పొటాటో, పచ్చిబఠానీ ఉడికిన తర్వాత అందులో ఎండబెట్టిన మెంతి ఆకులను మరియు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మంట తగ్గించి మరికొద్దిసేపు ఉడికించాలి. 

9.
చివరగా ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా వేసి, కలగలిపి, మరో రెండు నిముషాలు ఉడికించి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బేబీ పొటాటో పీస్ కర్రీ రెడీ...

0 comments:

Post a Comment