Sunday, March 3, 2013

తోటకూర పప్పు

తోటకూర పప్పు

- ఇవి కావాలి
కందిపప్పు : 1/4 కిలో
తోటకూర : పెద్ద కట్ట
టమాటాలు : 2
... ఉల్లిపాయలు : 2
చింతపండు : కొద్దిగా
ఎండుమిర్చి, పచ్చిమిర్చి: 4 కాయలు
ఉప్పు, పసుపు, కారం : సరిపడ
కరివేపాకు కొత్తిమీర : తగినంత
నూనె, ఇంగువ : కొద్దిగా

- ఇలా చేయాలి
పప్పు కడిగి పెట్టుకోవాలి. తోటకూరను బాగా కడిగి సన్నగా తరిగి పప్పులో వేయాలి. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కూడా తరిగి పప్పులో వేసి కుక్కర్‌లో పెట్టి ఉడికించాలి. చింతపండు నానబెట్టాలి. బాండీలో నూనె కాగిన తరువాత ఇంగువ పోపు పెట్టి దాంట్లో ఉడికిన పప్పు వేసి ఉప్పు, పసుపు, కారం, తగినంత వేసి చింతపండు రసం కూడా వేసి బాగా కలిపి కుతకుతలాడుతున్నప్పుడు దింపి సర్వ్‌చేయాలి. ఇదే విధంగా తోటకూర బదులు పాలకూర, బచ్చలికూరతో చేయవచ్చు.

0 comments:

Post a Comment