క్యారెట్ హల్వా
తయారు చేయు విధానం :-
క్యారెట్ కోరు తీసినది -450g
పాలు -850ml
పంచదార -125g
ఏలకులు -3
ఎండు ద్రాక్ష -2 టేబుల్ స్పూన్స్
పిస్తా పప్పు సన్నగా కోసినవి -2 టేబుల్ స్పూన్స్
జీడి పప్పు - 2 టేబుల్ స్పూన్స్
నెయ్యి -4 టేబుల్ స్పూన్స్
కుంకుమ పువ్వు - చిటికెడు
తయారు చేయు విధానం :-
ముందుగా పొయ్య వెలిగించి దానిమీద ఒక గిన్నె పెట్టి అందులో పాలు, క్యారెట్ కోరు, పంచదార, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి తక్కువ మంట మీద నెమ్మదిగా అడుగంట కుండా పాలు అంతా ఇగిరేవరకు ఉడకనివ్వాలి. పొయ్య మీద ఒక బాణలి పెట్టి నెయ్యి వేసి ఒక నిమిషం తరువాత పిస్తాపప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కొంచెం వేగనిచ్చి అందులో ఉడకపెట్టిన క్యారెట్ ముద్ద వేసి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఎరుపురంగు వచ్చి నెయ్యి పైకి తేలేలా ఉడకనివ్వాలి. అంతే మీ క్యారెట్ హల్వా రెడీ!!!!

0 comments:
Post a Comment