Friday, March 1, 2013

తోటకూర పులుసు తోటకూర పులుసు


తోటకూర పులుసు

కావాల్సిన పదార్ధాలు;-

తోటకూర - ఆరు పెద్ద కట్టలు
కందిపప్పు - ఒక కప్పు
చింతపండు - ఒక బత్తాయి కాయంత సైజులో తీసుకోవాలి.
ఉప్పు -- మూడు టీ స్పూన్స్
ఎండుమిరపకాయలు -- ఆరు
పచ్చిమిరపకాయలు -- ఇరవై
ఆవాలు -- అర టీ స్పూన్
జీలకర్ర - ఒక టీ స్పూన్
మెంతులు -- ఒక టీ స్పూన్
ఇంగువ - ఒక టీ స్పూన్
పసుపు - ఒక టీ స్పూన్
బియ్యపు పిండి - ఒక టేబుల్ స్పూన్
ఎం . టి .ఆర్ సాంబార్ పౌడర్ - రెండు టేబుల్ స్పూన్స్
నూనే - రెండు టీ స్పూన్స్

తయారు చేసే విధానం ;-

ముందుగ తోటకూరను బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని అందులో కందిపప్పు,తోటకూరను వేసి నీళ్ళు పోసి బాగా ఉడక బెట్టాలి.అది వుడికే లోపు పైన చెప్పిన చితపండును నీళ్ళు పోసి నాన పెట్టుకుని రసం తీసి వుంచుకోవాలి. ఇప్పుడు వుడికిన పప్పు,తోటకూర లో నీళ్ళు పోసి చితపండు రసం పోసి ఉప్పు వేసి పచ్చిమిరపకాయలను ముక్కలుగా తుంచి వేసి బాగా పులుసుని కాగా నివ్వాలి. కాగిన పులుసులో ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో బియ్యపు పిండిని వేసి నీళ్ళు పోసి ఉండలు లేకుండా పేస్టు లాగా కలిపి కాగుతున్న పులుసులో వేసి ,సాంబార్ పౌడర్ ని కూడా వేసి బాగా కలపాలి.ఒక పది నిముషాలు కాగనిచ్చి దించేయాలి.ఇప్పుడు ఒక బాండి ని తీసుకుని అందులో నూనే వేసి ఆవాలు,మెంతులు,జీలకర్ర,ఇంగువ,ఎండుమిరప ముక్కలు వేసి పోపును వేయించి పులుసులో వేసి బాగా కలపాలి.అంతే ఘుమ ఘుమ లాడే తోటకూర పులుసు రెడీ.

0 comments:

Post a Comment