Sunday, March 3, 2013

* నిమ్మ పులిహోర..

* నిమ్మ పులిహోర..

కావలసిన పదార్థాలు:
బియ్యం: 2cups
నిమ్మకాయ: 1(కట్ చేసి రసం తీసి పెట్టుకోవాలి)
కరివేపాకు: రెండు రెబ్బలు
పచ్చిమిరపకాయలు: 4-6
ఆవాలు: 1tsp
వేరుశగ(పల్లీలు): 1tbsp
మినప్పప్పు: 1 tbsp
పచ్చిశెనగపప్పు: 1tbsp
పసుపు: 1/4 tsp
ఇంగువ: చిటికెడు
మెంతి పొడి: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమిర: 2 రెమ్మలు
నూనె: తగినంత

1. మొదటగా పులిహోరకు ఎప్పుడు కూడా బియ్యం కడిగి కనీసం పదినిమిషాలనుండి అరగంట వరకు నాననివ్వాలి. తర్వాత బియ్యం కడిగి, నానబెట్టి కాస్త ఉప్పు కలిపి పొడిపొడిగా అన్నం వండాలి.
2. ఒక ప్లేట్ లో అన్నం తీసి చల్లారనివ్వాలి.
3. తర్వాత పచ్చిమిరపకాయలు నిలువగా చీల్చి పెట్టుకోవాలి. అల్లం చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి.
4. స్టౌ వెలిగించి అందులో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగాక ఆవాలు వేసి చిటపటలాడాక పచ్చిమిరపకాయలు, మినప్పప్పు, పచ్చిశెనగపప్పు, పల్లీలు, అల్లం ముక్కలు వేసి కొద్దిగా వేపాలి.
5. ఇప్పుడు పసుపు, కరివేపాకు వేసి కలిపి దింపేయాలి. ఈ పోపును కొద్దిగా ఉప్పు కలిపిన అన్నంలో వేయాలి. దానితో పాటు నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమిర కూడా వేసి మొత్తం బాగా కలియబెట్టాలి. అంతే నిమ్మ సువాసనతో కూడి రుచికరమైన పులిహోర రెడీ...

0 comments:

Post a Comment