Friday, March 1, 2013

ఆలూ కుర్మా


ఆలూ కుర్మా

కావాల్సిన పదార్ధాలు ;-

ఆలూ - అర కేజీ
కొబ్బరి చిప్ప - ఒకటి
ఏలక్కాయలు - నాలుగు
లవంగాలు - మూడు
దాల్చిన చెక్క - అంగుళం ముక్క
అల్లం - అంగుళం ముక్క
పచ్చిమిరపకాయలు - నాలుగు
ఎండుమిరపకాయలు - నాలుగు
వెల్లుల్లి రేకులు -నాలుగు
టమాటాలు -నాలుగు
నూనె -రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు తగినంత
ధనియాలు -ఒక స్పూన్
తయారు చేసే విధానం ;-

ముందుగ ఆలూని పెచ్చు తీసి బాగా కడిగి ముక్కలుగా తరిగి ఒక బాండిని తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేసి ఆలు ముక్కలు అర స్పూన్ ఉప్పు వేసి ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి.ఆలు ముక్కలు వేగే లోపు కొబ్బరి ముక్కలు,టమాటాలు,వెల్లుల్లి రేకులు,దాల్చిని చెక్క,లవంగాలు,అల్లం,ఎండుమిరపకాయలు,పచ్చి మిరపకాయలు, ధనియాలు వేసి గ్రేవీ కోసం మెత్తగా రుబ్బుకోవాలి.తరవాత ఆలు ముక్కలు మెత్తబడ గానే రుబ్బిన మిశ్రమానికి కొంచం నీళ్లు కలిపి ఆలు ముక్కలు లో వేసి కొంచం గ్రేవీ దగ్గర పడేవరకు ఉడకనిచ్చి ఒక స్పూన్ నెయ్యి వేసి,
ఉప్పు ఒక స్పూన్ వేసి దించేయాలి.అంతే నోరూరించే వేడి వేడి ఆలు కుర్మా రెడీ.ఇది చపాతీ ల్లోకి ,పూరి ల్లోకి.బిర్యాని లో కూడ చాల బావుంటుంది.

0 comments:

Post a Comment