అల్లం,నిమ్మ పులిహోర
కావలసిన వస్తువులు :
బియ్యం – 250 gms
నిమ్మకాయ – 1
అల్లం - అంగుళం ముక్క
కరివేపాకు – 2 రెబ్బలు
పచ్చిమిరపకాయలు – 5
ఆవాలు – 1/4 tsp
జీలకర్ర – 1/4 tsp
మినప్పప్పు – 1 tbsp
పసుపు – 1/4 tsp
ఇంగువ – చిటికెడు
ఉప్పు – తగినంత
పంచదార – 1/4 tsp
కొత్తిమిర – 2 రెమ్మలు
నూనె – 3 tbsp
పులిహోరకు ఎప్పుడు కూడా బియ్యం కడిగి కనీసం పదినిమిషాలనుండి అరగంట వరకు నాననివ్వాలి. అఫ్పుడు అన్నం వండితే ముద్దగా కాకుండా ప్రతి మెతుకు విడివిడిగా వస్తుంది. బియ్యం కడిగి, నానబెట్టి కాస్త బిరుసుగా వండాలి. వెడల్పాటి గిన్నెలో అన్నం వేసి తగినంత ఉప్పు, పంచదార వేసి కలిపి చల్లారనివ్వాలి. పచ్చిమిరపకాయలు నిలువగా చీల్చి పెట్టుకోవాలి. అల్లం చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్ లో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చిమిరపకాయలు, మినప్పప్పు, అల్లం ముక్కలు వేసి కొద్దిగా వేపాలి. ఇప్పుడు పసుపు, కరివేపాకు వేసి కలిపి దింపేయాలి. ఈ పోపును ఉప్పు కలిపిన అన్నంలో వేయాలి. దానితో పాటు నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమిర కూడా వేసి మొత్తం బాగా కలియబెట్టాలి. పది నిమిషాలు అలా వదిలేసి సర్వ్ చేయాలి. పక్కన ఆవకాయ, అప్పడం ఉంటే మరీ మంచిది. నిమ్మ, అల్లం, కొత్తిమిర కలిసి అద్భుతమైన రుచి, సువాసన ఇస్తాయి ఈ పులిహోరకి. అల్లం ముక్కల బదులు రసం కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం..

0 comments:
Post a Comment