Friday, March 1, 2013

బ్రింజాల్(వంకాయ) బజ్జీ

బ్రింజాల్(వంకాయ) బజ్జీ

కావలసిన పదార్థాలు:
వంకాయ ముక్కలు: 2cups
టమోటోలు: 2(చిన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1(చిన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పసుపు:1/4tsp
కారం: 1tsp
ధనియా పౌడర్: 1tsp
గరం మసాలా: 1tsp
నూనె : 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
పోపు కోసం:
చిన్న ఉల్లిపాయలు:
సోంపు:1tsp
ఆవాలు: 1tsp
మెంతులు: 1/2tsp
ఇంగువ: చిటికెడు

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసి అందులో ఉప్పు వేసి తర్వాత వంకాయ ముక్కలను వేసి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి.
2. పదిహేను నిమిషాల తర్వాత వంకాయలను ఉప్పు నీటిలో నుండి బయటకు తీసి బాగా నీళ్ళంత పిండేయాలి.
3. తర్వాత పాన్ వేడిచేసి అందులో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఇంగువ, సోపు గింజలు, మొంతులు, ఉల్లిపాయ గింజలు, ఆవాలు వేసి ఒక నిమిషం పాటు వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకూ వేయించుకోవాలి.
5. తర్వాత టమోటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకూ వేయించుకోవాలి.
6. టమోటాలు మెత్తగా వేగిన తర్వాత పసుపు, కారం, ధనియా పొడి, ఉప్పు వేసి బాగా కలబెట్టాలి.
7. చివరగా వంకాయ ముక్కలు కూడా వేసి పది నిమిషాల పాటు బాగా వేగించి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టా మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. వంకాయ మెత్తబడ్డాక కొత్తమీర తురుము చల్లకొని క్రింది దింపుకోవాలి. ఈ వంకాయ పికెల్ వేడి వేడి అన్నంలోని చాలా రుచిగా ఉంటుంది.

0 comments:

Post a Comment