Sunday, March 3, 2013

ఉల్లిపాయ పచ్చడి

ఉల్లిపాయ పచ్చడి

కావలసిన వస్తువులు :

సన్నగా తరిగిన ఉల్లిపాయలు – 1 కప్పు( 3)

ఎండుమిరపకాయలు – 5

ధనియాలు – 2 tbsp

జీలకర్ర – 1 tsp

ఆవాలు – 1/4 tsp

పల్లీలు – 3 tbsp

నువ్వులు – 1 tbsp

పసుపు – 1/4 tsp

కరివేపాకు – 2 రెబ్బలు

చింతపండు పులుసు – 1/4 కప్పు

ఉప్పు – తగినంత

నూనె – 4 tbsp

ముందుగా ప్యాన్ వేడి చేసి ఎండుమిరపకాయలు , జీలకర్ర, ధనియాలు, పల్లీలు, నువ్వులు వేసి దోరగా వేపాలి. అవి తీసివేసి రెండు చెంచాల నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. మిరపకాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, ధనియాలు, పల్లీలు, నువ్వులు మొదలైనవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వేయించిన ఉల్లిపాయలు, చింతపండు పులుసు వేసి మళ్లీ మెత్తగా అయ్యేవరకు గ్రైండ్ చేసుకోవాలి. చిన్న గరిటెలో మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు కూడా వేసి రెండు నిమిషాల తర్వాత రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో కలపాలి. అంతే చాలా త్వరగా తయారైపోయింది రుచికరమైన ఉల్లిపాయ పచ్చడి. అన్నం, చపాతీ, దోసెల్లోకి కాస్త వెరయిటీగా వడ్డించండి. తినేవాళ్లకు చివరలో అది ఏ పచ్చడో చెప్పాలని చెప్పండి. చూడండి ఎంతమంది చెప్పగలరో?? :)

0 comments:

Post a Comment