Saturday, March 2, 2013

ఆవడలు

ఆవడలు




కావాల్సిన పదార్ధాలు ;-

మినపపప్పు - ఒక పెద్ద కప్పు
ఉప్పు - సరిపడినంత
పెరుగు - అరకేజీ
ఆవాలు - అర టీ స్పూన్
మెంతులు- అర టీ స్పూన్
ఎండుమిరప ముక్కలు -ఒక టీ స్పూన్
పచ్చిమిరప ముక్కలు -ఒక టీ స్పూన్
కరివేపాకు రెమ్మలు -రెండు
ఇంగువ - పావు టీ స్పూన్
నెయ్యి -రెండు టీ స్పూన్స్
నునే -అరకేజీ

తయారు చేసే విధానం ;-

ముందుగ
మినపపప్పును రెండు గంటలు నానబెట్టాలి.ఇలా నానబెట్టుకున్న పప్పును హాఫ్ టీ
స్పూన్ ఉప్పును వేసి గారెల పిండిలాగా గట్టిగ రుబ్బి పెట్టుకుని ,ఒక
గిన్నెలో అరకేజీ పెరుగును తీసుకుని పెరుగును బాగా కవ్వం తో గిలకకొట్టి
అందులో ఒక స్పూన్ వుప్పువేసి స్టవ్ మీద బాండి నీ పెట్టి పైన చెప్పిన పోపు
దినుసులను వేసి అంటే నెయ్యి,ఆవాలు,మెంతులు,ఎండుమిరప ముక్కలు,ఇంగువ వేసి
కొద్దిగా వేగిన తరువాత పచ్చిమిరప ముక్కలు ,కరివేపాకును కూడా వేసి చిటపట
లడగానే ఈ పోపును తీసి పెరుగు గిన్నెలో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి
పక్కన.ఇప్పుడు అదే బాండి లో నునే పోసి బాగా వేడిగా కాగేదాకా ఆగి గారెలు
వెయ్యాలి.ఒక చిన్న గిన్నెలో నీరు పోసి చింత గింజ సైజు లోని గారెల పిండిని ఆ
నీటిలో కలిపి ఒక ప్లాస్టిక్ కవర్ పైన గానీ అరితకుపైన గానీ ఈ పిండిని
కలిపినా నీటిని చేత్తో తీసి రాసి మినప్పిండిని కొద్దిగా తీసుకుని బాల్ లాగా
చేసుకుని అరిటాకుపైన పెట్టి చేతితో చదునుగా తట్టి మధ్యలో వేలితో కన్నం
పెట్టి గారే లాగ వేయించాలి. ఈ గారెలను వేడిగ ఉన్నప్పుడే పెరుగులో
వేసేయ్యాలి.అవి పెరుగులో కోతసేపటికి నానిపోతాయి. ఇప్పుడు ఇంక మీరు
తినడానికి రుచికరమైన వేడి వేడి ఆవడలు రెడీ.

0 comments:

Post a Comment