Saturday, March 2, 2013

క్యాబేజీ పప్పు కూర


క్యాబేజీ పప్పు కూర


కావలిసిన పదార్దములు ;-

క్యాబేజీ -హాఫ్ ముక్క
పెసరపప్పు -ఒక కప్
పచ్చి మిరపకాయలు -ఆరు
ఎండుమిరపకాయలు -నాలుగు
మినపపప్పు -మూడు స్పూన్స్
ఆవాలు - రెండు స్పూన్స్
జీలకర్ర - ఒక టీ స్పూన్స్
పసుపు -చిటికెడు
ఉప్పు - తగినంత
కరివేపాకు - రెండు రెమ్మలు
నూనె - ఒక టీ స్పూన్
ఇంగువ -హాఫ్ టీ స్పూన్

తయారు చేయు విధానం :-
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో తరిగిన క్యాబేజీ ని పెసరపప్పు ని వేసి బాగా కడిగి నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. పెసరపప్పు ముద్దగా కాకుండా ఉండాలంటే కొంచెం ఉడకగానే ఉప్పు వేసేయాలి క్యాబేజీ ఉడకగానే నీటిని వంచేయాలి, తరువాత బాండి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులుని వేసి వేగాక ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ పెసరపప్పు కలపాలి అంతే గుమగుమలాడే పప్పు కూర రెడీ

0 comments:

Post a Comment