Saturday, March 2, 2013

పొదినా పచ్చడి

పొదినా పచ్చడి





కావాల్సిన పదార్ధాలు ;-

పొదినా ; 3 కట్టలు లావువి
చింతపండు ; 2నిమ్మకాయల అంత ముద్ద తీసుకోవాలి
ఎండు మిరపకాయలు ; 30
పచ్చి మిరపకాయలు ; 15
పసుపు ; అర టీ స్పూన్
ఇంగువ ;ఒక టీ స్పూన్
మినపపప్పు ; ఒక పెద్ద టేబుల్ స్పూన్
ఆవాలు ;ఒక టీ స్పూన్
మెంతులు ;2 టీ స్పూన్స్
నూనే ;ఆకును,పోపు దినుసులను వేయించడానికి సరిపడేంత
ఉప్పు ; 3 టీ స్పూన్స్

తయారుచేసే విధానం ;-

ముందుగా పొదినా ఆకుని బాగా కడిగి తడి లేకుండా ఒక పొడి బట్ట పైన పరిచి ఆకుని తడి లేకుండా ఆరబెట్టాలి.పచ్చి మిరపకాయలను కూడా ఆకు తో బాటే ఆరనివ్వాలి. తరవాత ఒక బాణలి తీసుకుని స్టవ్ మీద పెట్టి 2 గరిటెల నూనే పోసి అందులోనే పొదినా ఆకును వేసి పచ్చి వాసన పోయే లాగ బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. తరవాత బాణలిలో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నూనే పోసి దానిలోనే మినపపప్పు,ఆవాలు,మెంతులు ఎండు మిరపకాయలు,ఇంగువ ,పసుపు వేసి దోరగా పోపును వేయించి పెట్టుకోవాలి.పొదినా,పోపుకుడా బాగా చల్లారక ఒక స్పూన్ పోపును పక్కన పెట్టి మిగాతపోపును,చింతపండు,ఉప్పు,పచ్చిమిరపకాయలు అన్ని కలిపి గ్రైండ్ చేసి ఒక గిన్నెలో పెట్టాలి.తరవాత పొదినా ఆకును కూడా మెత్తగా రుబ్బి ఈ మిశ్రమాన్ని ఇందాక గిన్నెలో రుబ్బి పెట్టుకున్న కరంగుండలో వేసి బాగా కలపాలి.పక్కన పెట్టిన పోపును కూడా ఈ పచ్చడిలో వేసి కలపాలి.అంతే ఘుమ ఘుమ లాడే పొదినా పచ్చడి రెడీ.ఏమాత్రం నీరు తగిలిన పచ్చడి బూజు పట్టేస్తుంది. నీరు తగలకుండా వుంటే నెల రోజులైనా కూడా పాడు కాదు.

0 comments:

Post a Comment