Saturday, March 9, 2013

కొబ్బరితో కూర:

కొబ్బరితో కూర: 
తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసిన కీరా : నాలుగు కప్పులు పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పోపు కోసం : ఒక చెంచా నూనె, చిన్న చెంచాడు శెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిరప, కర్వేపాకు రెబ్బలు రెండు, పొడి కోసం : వేరుశెనగ పప్పు : 3 టేబుల్‌స్పూన్లు పుట్నాల పప్పు : 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము : ఒక పెద్ద చెంచాడు, రెండు పచ్చి మిరపకాయలు, రెండు కొత్తిమెర రెబ్బలు కీర దోసకాయ మరీ లేతగా ఉండి, తొక్క కూడా తినేయచ్చనుకుంటే దాన్ని అలాగే ఉంచి ముక్కలుగా కోసెయ్యండి. పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేడయ్యాక పోపు సామానంతా వేసెయ్యాలి. అందులో చిటికెడు పసుపు వేసి కీరా ముక్కలు వెయ్యాలి. మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉడికేలా చూసుకోవాలి. ఈలోగా శెనగపప్పు, పుట్నాల పప్పు... వంటివాటిని మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూరలో కలపాలి. తర్వాత కొబ్బరి తురుమునూ కలపాలి. కొబ్బరి అంటే ఇష్టం లేనివాళ్లు మానెయ్యొచ్చు. పొయ్యి మీదనుంచి దించి, వేడి తగ్గాక ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు ముందే కలిపితే కూర పొడిగా రాదు.

0 comments:

Post a Comment