Saturday, March 2, 2013

ఆలూ రైతా /బంగాళదుంప పెరుగు పచ్చడి


ఆలూ రైతా /బంగాళదుంప పెరుగు పచ్చడి

కావలసిన వస్తువులు

పెరుగు – 2 కప్పులు

ఉడికించిన బంగాళదుంపలు – 2

పచ్చిమిరపకాయలు – 1

కరివేపాకు – 1 రెమ్మ

ఉల్లిపాయ – 1

ఎండు మిరపకాయలు – 2

ఆవాలు – 1/4 tsp

జీలకర్ర్ర – 1/4 tsp

కొత్తిమిర – కొద్దిగా

ఉప్పు -తగినంత

నూనె-1 tsp


చిక్కటి పెరుగులో తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టండి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమిర కలపాలి. ఉడికించిన బంగాళదుంపలను పొడిపొడిగా చిదిమి ఇందులో కలపాలి. చిన్న గరిటెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడాక ఎండుమిరపకాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి కొద్దిగా వేగగానే పెరుగులో కలపాలి. ఈ పెరుగు పచ్చడిని పులావ్, బిరియానీతో కలిపి వడ్డించండి. చల్లగా చేసి వడ్డించినా బావుంటుంది.

0 comments:

Post a Comment