Sunday, March 3, 2013

మజ్జిగ పులుసు :-

మజ్జిగ పులుసు :-

కావలిసిన పదార్దములు :

మజ్జిగ - అయిదు వందల గ్రాములు 
సొరకాయ ముక్క - ఒక కాయలో సగం
టమాటో - ఆరు
పచ్చిమిరపకాయలు - పది
ములక్కాడలు -ఒకటి
కొత్తిమీర -ఒక కట్ట
కొబ్బరి ముక్కలు - హాఫ్ చెక్క
ధనియాలు - మూడు స్పూన్ లు
మిరియాలు -ఒక స్పూన్
జీలకర్ర -ఒక స్పూన్
నానబెట్టిన -సెనగపప్పు బియ్యం - ఒక కప్
పోపు దినుసులు -ఆవాలు, జీలకర్ర ,మెంతులు ,ఎండుమిర్చి ,కరివేపాకు, ఇంగువ , నెయ్యి రెండు స్పూన్స్

తయారు చేయు విధానము :-
మజ్జిగను ముందుగా కవ్వముతో గిలక్కొటుకోవాలి.పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి ,నానబెట్టిన సెనగపప్పు బియ్యం ,ధనియాలు ,మిరియాలు ,జీలకర్ర ,ఒక కొబ్బరి చెక్క ముక్కలు,అయిదు పచ్చిమిరపకాయలు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి .ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న మజ్జిగలో కలుపుకోవాలి .సొరకాయ ముక్కలు ,టమాటో ముక్కలు ములక్కాడ ముక్కలు నీరు పోసి ఉడకపెట్టుకోవాలి, ఉడకపెట్టుకున్న వాటిని మజ్జిగలో కలుపుకోవాలి .ఇప్పుడు స్టవ్ మీద సిమ్ లో ఉడకనివ్వాలి . మజ్జిగ పొంగు వచ్హాక పైన చెప్పిన పోపు దినుసులు వేసి నేతి లో వేయించి మజ్జిగలో కలిపి కొత్తిమీర వేసి దించేయాలి అంతే మజ్జిగ పులుసు రెడీ

0 comments:

Post a Comment