Friday, March 1, 2013

అరటికాయ కుర్మా

అరటికాయ కుర్మా

కావలసినవి:
అరటికాయలు - 2
ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
అల్లం-వెల్లుల్లి ముద్ద
- 1 టీస్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
కారంపొడి - 1 1/4 టీస్పూన్
ఉప్పు - తగినంత
గరంమసాలా పొడి
- 1/2 టీస్పూన్
కొబ్బరి పొడి
- 3 టేబుల్ స్పూన్స్
గసగసాల పొడి
- 2 టేబుల్ స్పూన్స్
పెరుగు - 1/2 కప్పు
నూనె - 3 టేబుల్ స్పూన్స్
ఇలా వండాలి :
అరటికాయలను చెక్కు తీసి అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకుని మజ్జిగ కలిపిన నీళ్ళల్లో వేసి ఉంచాలి. టమాటోలు మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఐదు నిమిషాలు ఉంచి చల్లారిన తర్వాత తొక్కతీసి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వెడల్పాటి ప్యాన్‌లో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి అరటికాయ ముక్కలను వేసి కలపాలి. ఇందులో కారంపొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి నిదానంగా వేగనివ్వాలి. ఒక గినె్నలో పెరుగు, కొబ్బరిపొడి, గసగసాల పొడి, గరంమసాలా పొడి, టమాటా ముద్ద వేసి బాగా కలపాలి. అరటికాయ ముక్కలు మెత్తబడ్డాక ఈ మిశ్రమాన్ని వేసి కలిపి నూనె తేలేవరకు నిదానంగా ఉడికించి చల్లి
దింపేయాలి. ఈ కూర అన్నం, రొట్టెలలోకి చాలా బావుంటుంది.

0 comments:

Post a Comment