Friday, March 1, 2013

చింత పండు పులిహోర

చింత పండు పులిహోర

కావలసిన పదార్ధాలు

బియ్యం ; ఒక కేజీ
చింతపండు ; పావుకేజీ
పసుపు ; 2 టీ స్పూన్స్
ఉప్పు ; 4 టీ స్పూన్స్
సెనగపప్పు ; 4 టేబుల్ స్పూన్స్
మినపపప్పు ; 3 టేబుల్ స్పూన్స్
పల్లీలు; 2 టేబుల్ స్పూన్స్
ఎండుమిరపకాయలు ; 15
పచ్చిమిరపకాయలు; 20
ఆవాలు ; 2 టీ స్పూన్స్
అల్లం ; 2అంగుళాల ముక్క
కరివేపాకు ; 2 కట్టలు
ఇంగువ ; 1 టేబుల్ స్పూన్
నూనె ; 3 గరిటెలు

తయారుచేసే విధానం ;

ముందుగ బియ్యం కడిగి ఉడికించి ఒక పెద్ద బేసిన్లో ఉండలుగా ఉండకుండా పొడిపొడిగా ఉండేట్టుగా అన్నం ఆరబెట్టాలి.తరవాత ఒక బాండి తీసుకుని 3 గరిటెల నునే పోసి అందులోనే మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు,ఇంగువ ఎండుమిరప ముక్కలు , 4మెంతి గింజలు పసుపు వేసి దోరగా వేయించాలి .అల్లం ముక్కని మెత్తగా గ్రైండ్ చెయ్యాలి .చింతపండుని ముందే నీరు పోసి నానపెట్టి ఉంచుకుని రసం తీసి పెట్టుకోవాలి.పోపు దోరగా వేగాగానే పచ్చిమిరప ముక్కలు ,కరివేపాకు ,అల్లం,ఉప్పు వేసి ఒక నిముషం తరవాత చింతపండు రసం పోసేసి ఒక పది నిముషాలు ఉడక నిచ్చి బేసిన్లోని అన్నం లో పోసి బాగా కలపాలి.అంతే ఇంక ఘుమఘుమ లాడే చింతపండు పులిహోర రెడీ .

0 comments:

Post a Comment