Thursday, October 1, 2015

* చెన్నై సాంబారు

సాంబారు దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన వంటకం. ఇది పప్పుతో తయారయ్యే వంటకం. దీనిని సాధారణంగా అన్నంతో తీసుకుంటారు. ఇడ్లీతో చాలా ఇష్టంగా తింటారు.

కావలసినవి: 
కందిపప్పు - కప్పు; కూరగాయ ముక్కలు - అర కప్పు; చింతపండు రసం - పావు కప్పు; సాంబారు ఉల్లిపాయలు - 10 (చిన్నవి, తొక్క తీయాలి); టొమాటో - సగం చెక్క; పచ్చి మిర్చి - 4 (ముక్కలు చేసుకోవాలి); పసుపు - పావు టీ స్పూను; సాంబారు పొడి - 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత

పోపు కోసం: ఆవాలు - పావు టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; మెంతులు - ఆరు గింజలు; కరివేపాకు - 2 రెమ్మలు; ఎండు మిర్చి - 2 (ముక్కలు చేయాలి); నూనె - 2 టేబుల్ స్పూన్లు

తయారి
కందిపప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించి, చల్లారాక గరిటెతో బాగా మెదపాలి

ఒక బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి

మధ్యకు చీల్చిన పచ్చిమిర్చి, కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా వేయించాలి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి

చింతపండు రసం వేసి పచ్చి వాసన పోయేవరకు ఉడికించాలి

కొద్దిగా నీటిలో సాంబారు పొడి, ఇంగువ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి మరుగుతున్న సాంబారులో వేయాలి

ఉడికించిన పప్పు వేసి బాగా కలపాలి

కరివేపాకు వేసి అన్నంతో వేడివేడిగా అందించాలి.

0 comments:

Post a Comment