Thursday, July 9, 2015

పాలకూర పకోడీ

పాలకూర పకోడీ
కావలసినవి :
పాలకూర : ఆరు కట్టలు
శనగపిండి : రెండు కప్పులు
బియ్యప్పిండి : కప్పు
కారం : రెండు స్పూన్లు
నూనె : డీప్ ఫ్రై కి సరిపడా
ఉప్పు : తగినంత
తయారి:
ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి వేసి కలిపి అందులో పాలకూర, కారం, ఉప్పు, నీరు వేసి గట్టిగా కలుపుకుని పక్కనపెట్టుకోవాలి. బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడెక్కిన తర్వాత కావలసిన ఆకారాల్లో వేసుకు
ని బంగారు రంగు వచ్చేవరకు వేయించి టిష్యూ పేపర్ మీదకు తీయాలి. దీనిని టొమాటో సాస్‌తో తింటే బాగుంటుంది.

0 comments:

Post a Comment