Friday, July 10, 2015

• బేబీకార్న్ మంచురియా

• బేబీకార్న్ మంచురియా 

కావల్సినవి: 
బేబీకార్న్ - పదిహేను, అల్లం తరుగు - చెంచా, వెల్లుల్లి - మూడు (తరగాలి), పచ్చిమిర్చి - మూడు (ముక్కల్లా కోయాలి), ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, క్యాప్సికం - ఒకటి (ముక్కల్లా కోయాలి), సోయాసాస్ - చెంచా, వెనిగర్ - అరచెంచా, కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు, ఉప్పు -తగినంత, మిరియాలపొడి - తగినంత, చక్కెర - కొద్దిగా, నూనె - వేయించేందుకు సరిపడా.

పిండికోసం:
మైదా - మూడుటేబుల్‌స్పూన్లు, మొక్కజొన్నపిండి - మూడు టేబుల్‌స్పూన్లు.

తయారీ:
మొక్కజొన్నపిండీ, మైదా, కొద్దిగా ఉప్పూ, అరచెంచా మిరియాలపొడిని ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరవాత నీళ్లు పోసుకుంటూ బేబీకార్న్ ముంచేందుకు వీలుగా పిండిలా కలుపుకోవాలి. బేబీకార్న్‌ని రెండు ముక్కల్లా కోయాలి. ఒక బేబీకార్న్ ముక్కను మైదా మిశ్రమంలో ముంచి కాగుతోన్న నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. ఇలా మిగిలిన వాటినీ చేసుకోవాలి.
ఇప్పుడు సాస్‌ని తయారు చేసుకోవాలి. బాణలిలో టేబుల్‌స్పూను నూనెను వేడిచేయాలి. అందులో ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని వేయాలి. అవి వేగాక క్యాప్సికం, సోయాసాస్‌ని వేయాలి. తరవాత తగినంత ఉప్పూ, మిరియాలపొడీ, చక్కెరా వేసి బాగా కలపాలి. ఇందులో రెండుటేబుల్‌స్పూన్ల నీళ్లు పోసి మంట తగ్గించాలి. సాస్ వేడయ్యాక వేయించి పెట్టుకున్న బేబీకార్న్, కొత్తిమీరా వేసి బాగా కలపాలి. చివరగా పైన వెనిగర్ వేసి దింపేస్తే సరి.

0 comments:

Post a Comment