Wednesday, July 15, 2015

మకాయి పకోడ

మకాయి పకోడ
కావలసినవి:
మొక్కజొన్నలు - 200 గ్రా.; పచ్చిమిర్చి - టీ స్పూన్
ఉల్లిపాయ తరుగు - 50 గ్రా.; కొత్తిమీర తరుగు - టీ స్పూన్ 
పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; కరివేపాకు తరుగు - టీ స్పూన్
జీలకర్ర పొడి - టీ స్పూన్; శనగపిండి - 100 గ్రా.;
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
నూనె -వేయించడానికి తగినంత
తయారి:
ఒక బేసిన్‌లో శనగపిండి, మొక్కజొన్నలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కరివేపాకు, జీలకర్రపొడి, అల్లం వెల్లుల్లిపేస్ట్, కొద్దిగా నీళ్లు కలిపి ముద్దలా చేయాలి.
కడాయిలో నూనె పోసి, కాగిన తర్వాత, కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని నూనెలో వేయించాలి.
గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి, టొమాటో సాస్‌తో వేడి వేడిగా వడ్డించాలి.

0 comments:

Post a Comment