Friday, July 10, 2015

• బేబీకార్న్ ఫ్రైటర్స్


• బేబీకార్న్ ఫ్రైటర్స్

కావల్సినవి:
బేబీకార్న్ - పన్నెండు, మజ్జిగ - ముప్పావుకప్పు, జీలకర్రపొడి - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, మైదా - అరకప్పు, మొక్కజొన్నపిండి - పావుకప్పు, నిమ్మరసం - అరచెంచా, కారం - చెంచా, నూనె - వేయించేందుకు సరిపడా.

తయారీ:
బేబీకార్న్‌ని శుభ్రంగా కడిగి రెండు పొడవు ముక్కల్లా చేసుకోవాలి. ఓ గిన్నెలో సగం దాకా నీళ్లు తీసుకుని అందులో ఈ ముక్కలు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక బేబీకార్న్ ముక్కల్ని వేయాలి. నీళ్లు మరిగాక దింపేసి బేబీకార్న్‌ని వేడినీటిలోనే ఉంచి మూత పెట్టేయాలి. ఐదునిమిషాలయ్యాక నీటిని వంపేయాలి. ఓ గిన్నెలో మజ్జిగా, తగినంత ఉప్పూ, చెంచా జీలకర్రపొడీ తీసుకుని బాగా కలపాలి. ఇందులో బేబీకార్న్‌ని వేసి వాటికి మజ్జిగ పట్టేలా కలిపి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇంతలో మైదా, మొక్కజొన్నపిండీ, మిగిలిన జీలకర్రపొడీ, కారం, మరికొంచెం ఉప్పూ, నిమ్మరసం ఓ గిన్నెలో తీసుకుని నీళ్లు పోసుకుంటూ చిక్కని పిండిలా కలుపుకోవాలి. ఫ్రిజ్‌లో ఉంచిన బేబీకార్న్‌ని ఇవతలకు తీసి మైదా మిశ్రమంలో ముంచి కాగుతోన్న నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. ఇలా మిగిలిన బేబీకార్న్‌ని కూడా చేసుకుంటే సరిపోతుంది. వీటిని వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

0 comments:

Post a Comment