గోరుచిక్కుడు 65
కావలసినవి
గోరుచిక్కుళ్లు: పావుకిలో, కార్న్‌ఫ్లోర్: 50 గ్రా., మైదా: 50 గ్రా., చిల్లీసాస్: టీస్పూను, వెల్లుల్లి తురుము: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, కారం: అరటీస్పూను, నూనె: 5 టీస్పూన్లు, బేకింగ్‌పౌడర్: చిటికెడు, మిఠాయిరంగు: చిటికెడు

తయారుచేసే విధానం
• కాయల్ని శుభ్రంగా కడిగి అంచులు కోసి తడి లేకుండా తుడవాలి.
• ఇప్పుడు ఓ గిన్నెలో కార్న్‌ఫ్లోర్, మైదా, వెల్లుల్లితురుము, ఉప్పు, కారం, బేకింగ్‌పౌడర్, మిఠాయిరంగు అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి. అందులోనే నూనె, చిల్లీసాస్ కూడా వేసి కలిపి 20 నిమిషాలు పక్కన ఉంచాలి.
• బాణలిలో నూనె పోసి కాగాక ఒక్కో గోరుచిక్కుడునీ అందులో ముంచి నూనెలో వేయించి తీయాలి. వీటిని ఏదైనా సాస్‌తో తింటే బాగుంటాయి.
0 comments:
Post a Comment