Saturday, July 11, 2015

• తోటకూర, కందిపప్పు పకోడీ

• తోటకూర, కందిపప్పు పకోడీ

కావలసిన పదార్థాలు:
కంది పప్పు - 2 కప్పులు
తోటకూర - 2 కట్టలు
ఉల్లిపాయలు - 3
ఎండు మిర్చి - 5
జీలకర్ర - 1 టీస్పూను
ఉప్పు - తగినంత
నూనె - వేపుడుకు సరిపడా

తయారీ విధానం:
పప్పును కడిగి గంటపాటు నీళ్ళలో నానబెట్టాలి.
పప్పును, ఎండుమిర్చిని కలిపి మెత్తగా పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
ఈ ముద్దకు సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, తోటకూర, జీలకర్ర, ఉప్పు చేర్చి బాగా కలపాలి.
బాండీలో నూనె వేడిచేసి పకోడీలు వేసి ఎర్రగా వేగాక టమోటా సాస్‌తో వడ్డించాలి.

0 comments:

Post a Comment