Friday, July 10, 2015

ఉల్లి పకోడి


ఉల్లి పకోడి

కావలసినవి:
ఉల్లిపాయలు - 3 (పెద్దవి)
పచ్చిమిర్చి - 6 
(సన్నగా కట్ చేసుకోవాలి)
కరివేపాకు - ఒక కట్ట
పల్లీల పొడి - నాలుగు టీ స్పూన్లు
(పల్లీలను వేయించి మెత్తగా పొడిచేసుకోవాలి)
ధనియాలపొడి - టీ స్పూను
జీలకర్రపొడి - టీ స్పూను
గరంమసాలా పొడి - అర టీ స్పూను
అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
శనగపిండి - రెండు కప్పులు
బియ్యప్పిండి - రెండు టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
కారం - తగినంత
కొత్తిమీర - చిన్న కట్ట
పుదీనా - కొన్ని ఆకులు
(సుమారు పదిహేను ఆకులు)
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తయారి:
ఉల్లిపాయలను ఒలిచి సన్నగా పొడవుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని పొడవుగా చీలికలు చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పుదీనా ఆకులు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పల్లీలపొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో తగినంత నూనె పోసి కాగిన తరవాత ఆ నూనెలో పకోడీలు వేసి గోధుమరంగు వచ్చాక తీసేయాలి. వీటిని సాస్‌తో తింటే బావుంటాయి.

0 comments:

Post a Comment