Thursday, July 16, 2015

* పుల్లటి మామిడి పులిహోర...

* పుల్లటి మామిడి పులిహోర...
కావలసిన పదార్థాలు: మామిడి కాయ - ఒకటి, అన్నం - నాలుగు కప్పులు, పచ్చిమిరపకాయలు - ఆరు, ఎండు మిరపకాయలు - నాలుగు, ఆవాలు - అర టీ స్పూను, అల్లం ముద్ద - ఒక టేబుల్ స్పూను, శెనగపప్పు - ఒక టేబుల్ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: మామిడికాయని సన్నగా తరుముకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి వేడెక్కాక శెనగపప్పు, పల్లీలు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముద్ద, ఎండు మిరపకాయలు వేసి వేగించాలి. అన్నీ ఎర్రగా వేగాక కొద్దిగా పసుపు, ఉప్పు, మామిడి తురుము వేసి కలిపి దించేయాలి. దీన్ని అన్నంలో వేసి కలుపుకోవాలి. పుల్లటి మామిడి పులిహోర తయారయినట్టే.

0 comments:

Post a Comment