ఫ్రైడ్ చిల్లీ ఇడ్లీ
కావలసినవి:
ఇడ్లీలు - ఆరు, ఉల్లిపాయలు (తరిగి)- రెండు, టొమాటోలు(తరిగి) - మూడు, వెల్లుల్లి రెబ్బలు (నలిపి)- ఆరు, కరివేపాకు-కొద్దిగా, టొమాటో సాస్ - నాలుగు టేబుల్‌స్పూన్లు, కారం, పసుపు -ఒక్కో టీస్పూన్ చొప్పున, పచ్చి మిరపకాయలు(నిలువుగా చీల్చి) - ఆరు, నూనె- వేయించడానికి సరిపడినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా, మైదా - ఒక కప్పు, మొక్కజొన్నపిండి- ఒక టేబుల్‌స్పూన్, మిరియాల పొడి- ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు-తగినంత

తయారీ:
ఇడ్లీలని ఒకే సైజులో కొంచెం పెద్ద ముక్కలుగా కోయాలి. మైదా, కార్న్‌ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి కలపాలి. ఈ పిండిలో ఇడ్లీ ముక్కలను ముంచి నూనెలో గోధుమరంగు వచ్చేవరకు వేగించాలి. వేరొక కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె పోసి కరివేపాకు, వెల్లుల్లిలను వేగించాలి. తరువాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మూడు నిమిషాలపాటు వేగిన తరువాత టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఒక నిమిషం తరువాత టొమాటో సాస్ వేసి, నూనె తేలేవరకూ ఉడికించాలి. తరువాత దానిలో కారం, పసుపు, ఉప్పు, ఫ్రై చేసిన ఇడ్లీలు వేసి, రెండు నుంచి మూడు నిమిషాలపాలు ఉడికించాలి. తరువాత కొత్తిమీరతో అలంకరించి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

0 comments:
Post a Comment