Wednesday, July 15, 2015

మసాలా బేసన్ రోటీ

మసాలా బేసన్ రోటీ
కావల్సినవి: సెనగపిండి - కప్పు, గోధుమపిండి - అరకప్పు, పసుపు, జీలకర్ర, ధనియాలపొడి - అరచెంచా చొప్పున, ఉప్పు - తగినంత, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ: ముందుగా సెనగపిండీ, గోధుమపిండీ తీసుకుని అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలిపి పదినిమిషాలు నాననివ్వాలి. ఓ గిన్నెలో పసుపూ, జీలకర్రపొడీ, ధనియాలపొడీ, తగినంత ఉప్పూ తీసుకుని.. కొద్దిగా నీళ్లు పోస్తూ మసాలాగా కలిపి పెట్టుకోవాలి. నానిన పిండిని ఎనిమిది నుంచి తొమ్మిది ఉండల్లా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని పూరీలా వత్తుకోవాలి. దానిపై ముందుగా చేసుకున్న మసాలాను పూతలా రాయాలి. తరవాత త్రికోణం ఆకారంలో మడిచి ఇంకొంచెం వత్తాలి. దీన్ని పెనంపై ఉంచి నెయ్యి వేసుకుని రెండువైపులా కాల్చుకుని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన ఉండల్నీ చేసుకోవాలి.

0 comments:

Post a Comment